బీసీ సెల్ విభాగంలో నియమాకాలు

–బీసీ విభాగం నగర కార్యదర్శిగా మురళీ
చిత్తూరు కార్పొరేషన్‌: వైయస్సార్‌సీపీ నగర బీసీ సెల్‌ విభాగంలో నూతన నియమాకాలు చేపట్టారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ బీసీ విభాగం నగర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్‌ వారి వివరాలను వెల్లడించారు. నగరంలో పార్టీని మరింత పట్టిష్టం చేసే చర్యల్లో భాగంగా బీసీ సెల్‌ నగర కార్యదర్శిగా మురళీ, 48వ డివిజన్‌ బీసీ విభాగం ఇన్‌చార్జిగా హమీద్‌ (చామంతి)లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరితో పాటు 50 డివిజనులకు బీసీ ఇన్‌చార్జిలను త్వరలో నియంచనున్నుట్లు వెల్లడించారు. పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రరెడ్డి పిలుపు మేరకు ఇంచార్జ్ లు పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి కృషి చేస్తారన్నారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని విస్తతృంగా ప్రచారం కల్పించి ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తారన్నారు. పార్టీ బలోపేతంకు శక్తివంచన లేకుండ కృషి చేస్తామని మురళీ, హమీద్‌లు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top