వైయస్సార్సీపీలో నియామకాలు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో పలువురికి నూతన పదవులు వరించాయి. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్‌ మొండితోక అరుణకుమార్‌ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా, షేక్‌ గౌస్‌ మొహిద్దీన్‌ను విజయవాడ నగర మైనార్టీ సెల్‌ అధ్యక్షులుగా నియమించారు. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వలవల మల్లికార్జునరావు (బాజ్జి)ని అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.

Back to Top