ట్రేడ్ యూనియన్ లో నూతన నియామకాలు

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీలో నూతన నియామకాలు జరిగాయి. వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రైవేటు లెక్టరర్స్ మరియు టీచర్స్ ఫోరం అధ్యక్షులుగా పర్వతరెడ్డి బాలకృష్ణారెడ్డి నియమితులయ్యారు. 

పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్ర బిక్షపతి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, తెలంగాణ పార్టీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి అనుమతి మేరకు  పార్టీ ట్రేడ్ యూనియన్ కమిటీలో పలువురిని ఆయా పదవులలో నియమించారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యలమంద నాయక్, కార్యదర్శులుగా రాచకొండ సత్తిరాజు, కె. అప్పారావు, సాంబయ్యగౌడ్,  జి. భాస్కర్ రావ్, సుదర్శన్... ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శులుగా డాన్సి చంద్రశేఖర్, ఎం.డి. అక్రమ్ పాషాలు నియమితులయ్యారు.
Back to Top