రాష్ట్ర యూత్ కమిటీలో నూతన నియామకాలు

హైదరాబాద్ : తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీలో వివిధ పదవుల్లో  నియామకాలు చేసింది. రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శులుగా తిరుపతయ్య, గంగాధర్, హనుమంతురెడ్డి, సిరి రవిని నియమించింది. అదేవిధంగా వైయస్సార్సీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శిగా దుబ్బాక సంపత్, జీహెచ్ ఎంసీ యూత్ ప్రధాన కార్యదర్శిగా మన్నెం సుధాకర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడుగా వందాల సతీష్ నియమితులయ్యారు.

వైయస్సార్సీపీ అధ్యక్షుడు  వైయస్ జగన్  ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అనుమతితో, పార్టీ రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్ ఆధ్వర్యంలో వారిని రాష్ట్ర యూత్ కమిటీలో వివిధ పదవుల్లో నియమించడం అయింది. ఈ మేరకు  పార్టీ  ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top