తెలంగాణ రాష్ట్ర కమిటీలో నూతన నియామకాలు

హైద‌రాబాద్‌) వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్య‌క్షులు  వైయస్ జగ‌న్‌ ఆదేశాల మేర‌కు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర క‌మిటీలో వివిధ పదవులకు నూతన నియామకాలు చేపట్టారు. 

రాష్ట్ర కార్య‌ద‌ర్శి, జీహెచ్ఎంసీ స‌హ ప‌రిశీల‌కులుగా గుమ్మ‌డి మ‌హేంద‌ర్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా క‌లుకొట్ల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డిని నియ‌మించారు. అదేవిధంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాద‌ళ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా అశోక్ యాదవ్, సత్యనారాయణ, కార్యదర్శులుగా యాకుల ప్ర‌తాప్‌, బాస‌మ‌ల్ల ప‌ద్మ‌రావ్‌, వ‌క్రాంత్ విమ‌ల్‌కుమార్ లు నియమితులయ్యారు. 

పార్టీ మైనార్టీ విభాగం అధ్య‌క్షుడు మ‌తిన్ ముజాద‌ది అధ్య‌క్ష‌త‌న యండి. రిజ్వాన్ హుస్సేన్‌, స‌య్య‌ద్ నౌఫిల్‌, నాస్రిన్ కౌస‌రి, మ‌హ్మ‌ద్ ముస్తాఖ్, యండి. జ‌మీర్ పాష‌, షేక్ అబ్దుల్లా, నాసిర్‌, ఇబ్ర‌హీం ను మైనార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా నియ‌మితులయ్యారు. మ‌హ్మ‌ద్ వాజీద్‌, మాజీద్ ఖాన్‌, యండి. ముజాఫ‌రుద్దీన్ ఖాన్ ను మైనార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా నియమించడమైనది. 
Back to Top