తెలంగాణ రాష్ట్ర కమిటీలో నూత‌న నియ‌మాకాలు

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆయా పదవులకు సంబంధించిన నూతన నియామకాలను ప్రకటించారు . వైయ‌స్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(ఎస్సీ సెల్‌)గా క‌స్తాల ముత్త‌య్య‌, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కోడి మ‌ల్ల‌య్య యాద‌వ్, మైనార్టీ సెల్ న‌ల్గొండ జిల్లా అధ్య‌క్షులుగా ఎం.డి. ఫ‌యాజ్‌, రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా క‌ర్ల సుంద‌ర్‌బాబు, రాష్ట్ర యూత్ కార్య‌ద‌ర్శిగా మంద వెంక‌టేశ్వ‌ర్లు, ఎస్సీ సెల్ న‌ల్గొండ జిల్లా అధ్య‌క్షుడిగా బాలెంల మ‌ధు, బీసీ సెల్ న‌ల్గొండ జిల్లా అధ్య‌క్షుడిగా ముషం రామానుజం, బీసీ సెల్ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా క‌ర్నె వెంక‌టేశ్వ‌ర్లు, న‌ల్గొండ జిల్లా అధికార ప్ర‌తినిధిగా సుతారి శ్రీ‌ను, రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా లింగం స‌త్య‌నారాయణరెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్య‌ద‌ర్శిగా ర‌హీమ్ ష‌రీఫ్‌లు నియమితులయ్యారు.

రాష్ట్ర మ‌హిళ క‌మిటీలో...
వైయ‌స్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర మ‌హిళ అధ్య‌క్షురాలుగా శ్యామ‌ల‌, విజ‌య‌ల‌క్ష్మి, ప్ర‌ధాన కార్యదర్శులుగా జూలి బెన్నా, క్రిస్టోలైట్‌, గాదె ర‌మాగౌడ్‌, యం. పుష్ప‌ల‌త‌, వ‌న‌జ,  మేరీ, కార్య‌ద‌ర్శులుగా జ్యోతిరెడ్డి, నెహా, అల్ఫ‌రాన్ స‌మ్మ‌, విష్ణుప్రియ‌, బొక్క‌న‌ప‌ల్లి రాజ‌మ్మ‌, సంయుక్త కార్య‌ద‌ర్శురాలుగా రాగ‌సంధ్య‌, ప‌ద్మ‌, ల‌క్ష్మీదేవి, గ‌డ్డం జ‌ల‌జ‌లు నియ‌మితుల‌య్యారు.

వైయ‌స్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా మెహినాబాద్ మండ‌ల అధ్య‌క్షుడిగా మంద‌డి వెంక‌ట రెడ్డి, శంక‌ర్‌ప‌ల్లి మండ‌ల అధ్య‌క్షుడిగా గుంతల రంగారెడ్డి, న‌వాపేట మండ‌ల అధ్య‌క్షుడిగా సారా జ‌గ‌న్‌, షాబాద్ మండ‌ల అధ్య‌క్షుడిగా యండి. ఖాజ‌భాష‌, చెవేళ్ల మండ‌ల అధ్య‌క్షుడిగా పిసారి శివారెడ్డి, ప‌రిగి మండ‌ల అధ్య‌క్షుడిగా సంజ‌న‌గారి మోహన్ రెడ్డి, పూడుర్ మండ‌ల అధ్య‌క్షుడిగా బి.సురేష్‌, దోమ మండ‌ల అధ్య‌క్షుడిగా సంపాలి హ‌రిబాబు, కులుక‌చెర్ల మండ‌ల అధ్య‌క్షుడిగా శ్రీ‌నివాస్‌, యాచ‌రం మండ‌ల అధ్య‌క్షుడిగా జ‌య‌రాజ్‌, హయ‌త్‌న‌గ‌ర్ మండ‌ల అధ్య‌క్షుడిగా యం.రాజిరెడ్డి, ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌ల అధ్య‌క్షుడిగా జి. హారినారాయ‌ణ‌, మంచాల్ మండ‌ల అధ్య‌క్షుడిగా బుగ్గ‌రాముడు, కుత్భుల్లాపూర్ మండ‌ల అధ్య‌క్షుడిగా న‌ర్సిరెడ్డిగారి బాల్‌రెడ్డి, స‌రూర్‌న‌గ‌ర్ మండ‌ల అధ్య‌క్షుడిగా కొంతం మోహ‌న్‌రెడ్డి, వికారాబాద్ మండ‌ల అధ్య‌క్షుడిగా రిక్క‌ల గోవ‌ర్థ‌న్ రెడ్డిలు నియ‌మితుల‌య్యారు. 
Back to Top