రాష్ట్ర రైతు విభాగంలో నూతన నియామకాలు

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు  రాష్ట్ర రైతు విభాగంలో పలువురిని ఆయా పదవులలో నియమించడమైనది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి చెందిన తరిమల శరత్ చంద్రరెడ్డిని రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రటరీగా, రాయలసీమ ప్రాంత ఇంఛార్జ్ గా నియమించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన సింహాద్రి రమేష్ బాబుకు రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రటరీ పదవితో పాటు గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన కె, త్రినాథరెడ్డిని జనరల్ సెక్రటరీ పదవితో పాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల ఇంఛార్జ్ గా నియమించారు.

Back to Top