వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ ప్రజాప్రతినిధులు

  • టీడీపీకి నెల్లూరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల రాజీనామా
  • వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరిన నేతలు
  • ఎంపీపీ, ఇద్దరు ఎంపీటీసీలతో పాటు మాజీల చేరిక
హైదరాబాద్ః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌సల పరంపర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్సీపీలో చేరారు.  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియ‌ర్ నేత న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ,  పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో  పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట ఎంపీపీ కైలాసం రేణుకతో పాటు ఇద్దరు ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్ లు పార్టీలో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి  వైయస్ జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డిలు, శ్రీనివాసులురెడ్డి, విజయకుమార్, రజత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ...స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల బలోపేతం వైయస్ జగన్ నాయకత్వంలో మాత్రమే సాధ్యమని నమ్మి టీడీపీ నాయకులు వైయస్సార్సీపీలో చేరారని వైవీ చెప్పారు. నెల్లూరు జిల్లాలో వైయస్సార్సీపీ స్థానికసంస్థల అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డికి వీరి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కర్నూలు, నెల్లూరు, వైయస్ఆర్ కడప జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్సీపీ గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

కైలాసం రేణుక
చంద్రబాబు పాలనలో అభివృద్ధి అన్నదే జరగడం లేదని ఎంపీపీ రేణుక అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్ మీద ఉన్న అభిమానంతో పార్టీలో చేరినట్లు చెప్పారు. వైయస్సార్సీపీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. 

Back to Top