వైయ‌స్ఆర్ సీపీలోకి నెల్లూరు టీడీపీ నేత‌లు

హైదరాబాద్ః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌సల పరంపర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియ‌ర్ నేత న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ,  పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో  వైయస్సార్సీపీలో చేరారు. ఇందుకూరుపేట ఎంపీపీ కైలాసం రేణుకతో పాటు పలువురు ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్  తదితరులకు కండువాలు కప్పి  వైయస్ జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 

Back to Top