29న నెల్లూరు జిల్లా ప్లీనరీ

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీన నెల్లూరు అనిల్‌ గార్డెన్స్‌లో ప్లీనరీ ఉంటుందన్నారు. ఈ ప్లీనరీకి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. 

Back to Top