నెహ్రూచౌక్‌లో నేడు షర్మిల బహిరంగ సభ

బంటుమిల్లి (కృష్ణాజిల్లా), 6 ఏప్రిల్‌ 2013: మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి తనయ, వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల శనివారంనాడు కృష్ణాజిల్లా బంటుమిల్లి నెహ్రూచౌక్‌ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మరో ప్రజాప్రస్థానం 113వ రోజు శనివారం కోడూరులో ప్రారంభమవుతుందని పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీన‌ర్ సామినేని ఉదయభాను తెలిపారు.

‌అక్కడి నుంచి కలవపూడి సత్రం, పెదపాలపర్రు, చౌటుపల్లి, కొత్తమల్లాయిపాలెం వరకు శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగిన తరువాత మధ్యాహ్న భోజన విరామం ఉంటుందని వారు పేర్కొన్నారు. అనంతరం మల్లాయిపాలెం గేటు, నక్కల కాల్వ, బంటుమిల్లి రోడ్డు, ముబారక్ సెంటర్, ఓ‌ల్డు బైపాస్ రోడ్డు, గు‌డ్‌మాన్‌పేట, బస్టాండ్ వరకు పాదయాత్ర ‌చేస్తారు. అనంతరం ఆమె నెహ్రూచౌక్‌లో జరిగే బహిరంగలో ప్రసంగిస్తారు. సభ తరువాత ఏలూరు రోడ్డు వద్ద శ్రీమతి షర్మిల శనివారం రాత్రికి బస చేస్తారని రఘురాం, ఉదయభాను తెలిపారు.
Back to Top