బ్రాహ్మణుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఏదీ?


బ్రాహ్మణ  సమస్యలపై ఆత్మీయ సమావేశం విశాఖపట్నంలో ఈ నెల 10న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తునట్లు ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు తెలిపారు. ఈ సమావేశానికి బ్రాహ్మణులతో సహ అర్చక  సంఘాలు కూడా హాజరవుతున్నారని తెలిపారు. బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసిన కార్పోరేషన్‌ టీడీపీ సొంత కార్పొరేషన్‌లా మారిందని వారు విమర్శించారు అర్చకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన జీవోలు అమలు కావడంలేదన్నారు. గతంలో మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.1000 కోట్ల  ఖర్చుచేస్తే, టీడీపీ ప్రభుత్వం వివిధ వర్గాల కార్పొరేషన్లకు 500 కోట్లు మాత్రమే కేటాయించి  నాలుగో వంతు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. పార్టీ అధ్యక్షులు నిర్వహించే సమావేశంలో అన్ని అంశాలపైనా చర్చిస్తామని వారు వివరించారు. 
Back to Top