2019లో రాబంధుల రాజ్యం కావాలా.. ప్రశాంత నగరం కావాలా..?

విశాఖపట్నం: 2019లో మనల్ని పరిపాలించడానికి రాబంధుల రాజ్యం కావాలా.. ప్రశాంత విశాఖ నగరం కావాలా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ ప్రజలను అడిగారు. విశాఖపట్నంలో వైయస్‌ఆర్‌ సీపీ నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దస్‌పల్లా కొండలను తవ్విన రాబంధులు ఎవరూ.. కొమ్మాది, మధురవాడ, భీమిలి భూములను పీక్కుతింటున్న రాబంధులు ఎవరో ప్రజలంతా గమనించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల డైరెక్షన్‌లో విశాఖ భూదందాల మాస్టర్‌ ప్లాన్‌ నడుస్తుందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇసుక మాఫియా, ల్యాండ్‌ మాఫియాలో తిన్నవారందరినీ కక్కించే రోజు తప్పకుండా వస్తుందన్నారు. విశాఖను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. 

Back to Top