బీజేపీతో లింక్స్‌ ఉంటే.. అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడ‌తాం



- అరుణ్‌జైట్లీ గ‌తంలో చెప్పింది ఇప్పుడు చెప్పారు
-  చంద్రబాబు తన మంత్రులను కేంద్ర కేబినెట్‌ నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నారో
 
అమ‌రావ‌తి : బీజేపీతో త‌మ‌కు లింక్స్‌ ఉంటే.. ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడ‌తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. తన పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నారని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  ‘ఆన్‌ రియాలిటీ చెక్‌’  కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌.. పాదయాత్రలో ఉన్న వైయ‌స్‌ జగన్‌తో ముచ్చటించారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు ప్రసారమైన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ జైన్‌ అడిగిన పలు ప్రశ్నలకు వైయ‌స్‌ జగన్‌ సమాధానాలు ఇచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గతంలో చేసిన ప్రకటననే తాజాగా మరోసారి చేశారని, అయినా చంద్రబాబు ఎందుకు తన మంత్రులను కేంద్ర కేబినెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. బీజేపీతో లింక్స్‌ ఉన్నాయా? అని శ్రీనివాసన్‌ జైన్‌ ప్రశ్నించగా.. బీజేపీతో లింక్స్‌ ఉంటే.. ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెడతామని ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ చేతులు కలిపి తనను కేసులలో ఇరికించాయని, దివంగత నేత వైయ‌స్‌ఆర్‌ బతికి ఉన్నంతకాలం తనను గౌరవనీయుడిగా చూశారని, ఆయన చనిపోయిన తర్వాత క్షుద్రరాజకీయాల్లో భాగంగా తనను టార్గెట్‌ చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ప్రధాని మోదీ నెరవేర్చలేదని అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top