అమెరికా పర్యటన అట్టర్ ప్లాపైందని అక్కసు

  • రామజపం లాగ ఎప్పుడూ టీడీపీ నేతలకు వైయస్ జగన్ జపమే
  • ప్రజలను గాలికొదిలేసి బాబు అమెరికాలో డ్రామాలు ఆడుతున్నారు
  • బాబు విదేశీ పర్యటనల ఖర్చుకు తగ్గ పెట్టుబడులు కూడ రాలేదు
  • ఏమీ లాభం ఉండదనే బాబు అమెరికా టూర్ లోంచి లోకేష్ ను తీసేశారు
  • వైయస్సార్సీపీకి ప్రజల ప్రయోజనాలే ముఖ్యం
  • పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
  • హైదరాబాద్ః చంద్రబాబు తన అమెరికా పర్యటన అట్టర్ ఫ్లాప్ కావడంతో దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రజలను మభ్యపెడుతూ మెగా షో లా సృష్టిస్తూ వైయస్సార్సీపీపై బురదజల్లుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బాబు ఓ స్మగ్లర్ అని, నిధుల కోసం వెళ్లాడని...  వైయస్సార్సీపీ అమెరికాలోని ఇర్వింగ్ పోలీసులకు ఈమెయిల్స్ పంపిందంటూ , టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ఆరోపణలను బొత్స తీవ్రంగా ఖండించారు. రామజపం లాగా ఎప్పుడూ వైయస్సార్సీపీ, వైయస్ జగన్ పేరు తప్ప టీడీపీ నేతలకు ఇంకో పనేలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే వారిని గాలికొదిలేసి బాబు విదేశాల్లో డ్రామాలాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బి. నారాయణరెడ్డిని చూసేందుకు వైయస్ జగన్ అనంతకు వెళితే..జగన్, విజయసాయిరెడ్డి అమెరికా ఇష్యూపై సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారంటూ ఓ చానల్ లో బ్రేకింగ్ రావడం హాస్యాస్పదంగా ఉందని బొత్స అన్నారు. వైయస్సార్సీపీకి మీ తాలుకా కార్యచరణ కంటే రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రైతుల కష్టాలపైనే దృష్టి సారిస్తుందని ప్రభుత్వానికి హితవు పలికారు. బాబు అమెరికాకు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్లారో, లేక అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో త్వరలోనే తెలుస్తుందన్నారు. బాబు అక్కడ ప్రజాధనాన్ని ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో, ఆయన అనుచరులు అక్కడ జిందాబాద్ లు ఏవిధంగా కొడుతున్నారో తమకు అన్నీ తెలుసునన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. 

    మూడేళ్లలో 15దేశాలు తిరిగిన చంద్రబాబు ఏమేరకు పెట్టుబడులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.  బాబు పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, శుద్ధ దండగని తెలిసిందేనన్నారు. జపాన్, మలేషియా, సింగపూర్, దుబాయి, కొలొంబో ఎక్కడకు వెళ్తే  అక్కడి పరిజ్ఞానాన్ని అమరావతికి తీసుకొస్తానంటూ బాబు మాట్లాడడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉంటేనే ఎవరైనా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తారు తప్ప...బాబు, లోకేష్ ల ముఖం చూసి కాదని ఎధ్దేవా చేశారు.  రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి వస్తే చినబాబు మా వాటా ఎంత అని అడుగుతున్నారని మండిపడ్డారు. ఇలా లంచాలు, కమీషన్లు అడుగుతుంటే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని నిలదీశారు.  కాకినాడలో సెల్ కంపెనీ ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందో బాబు సమాధానం చెప్పాలన్నారు. జపాన్ వెళ్లొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జపాన్ బాషను రాష్ట్రంలో ప్రవేశపెడతానన్న బాబు వ్యాఖ్యలపై చురక అంటించారు. జపాన్ కు చెందిన మాకీ సంస్థ ఏపీలో రాజకీయ ప్రమేయం, ప్రభుత్వంపై చేసిన ఆరోపణలతో కోర్టు ఏవిధంగా నోటీసులు ఇచ్చిందో గుర్తు చేశారు.  

    బాబు విదేశీ పర్యటనల ఖర్చుకు దగ్గ పెట్టుబడి కూడ రాలేదని బొత్స అన్నారు. దేశం మొత్తం మీద అవినీతిలో ఏపీ నంబర్ వన్ అని అనేక సంస్థలు చెబుతున్నాయన్నారు. విదేశాలకు వెళ్లి బాబు ఏపీ పరువు తీస్తున్నాడని బొత్స ఫైర్ అయ్యారు. మీమీద మెయిల్స్ పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది.  మీ జోడి ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా..?నీవు దద్దమ్మవా...? అని బాబుపై బొత్స ధ్వజమెత్తారు.  ఆడలేక మధ్యలో ఓడదరువు అన్నట్టు బాబు రాష్ట్రానికి ఏమీ చేయలేక వైయస్సార్సీపీని ఆడిపోసుకోవడం సిగ్గుచేటన్నారు. అమెరికా వెళ్లాక ఏవిధమైన ప్రయోజనం జరగదని తెలిసే బాబు లోకేష్ ను అమెరికా టూర్ లోంచి డ్రాప్ చేశాడని విమర్శించారు.  ఇద్దరూ వెళితే బద్నామైపోతారన్న ఉద్దేశ్యంతోనే లోకేష్ వెళ్లలేదన్నారు. దీనిపై బాబు ప్రజలకు వివరణ ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్ లో 20 పంటలు పండింతే ఒక్కదానికి కూడ గిట్టుబాటు ధర లేదు. మిరప రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు. ఇలాంటి సమయంలో రాష్ట్రాన్ని గాలికొదిలేసి బాబు అమెరికాలో డ్రామాకు తెరదీశారని బొత్స మండిపడ్డారు. కాలిఫోర్నియా గవర్నర్ తో మీటింగ్ పెట్టుకొని అన్యాయంగా రాష్ట్ర విభజన జరిగిందని బాబు చెబుతున్న తీరుపై బొత్స నిప్పులు చెరిగారు.
Back to Top