ఐదు కోట్ల ప్రజలను మోసం చేస్తున్నారు

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన రాజకీయ వేత్తను ప్రజలంతా అసహ్యంచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య∙ఎన్ని మాటలు మార్చారో ఈ మూడు సంవత్సరాల్లో పార్లమెంట్‌ సాక్షిగా తెలుగు ప్రజలంతా చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, వెంకయ్య అపోషిజన్‌లో ఉంటూ హోదాపై ఎలా మాట్లాడారో అందరికి తెలుసన్నారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు, కూలీలు, రాష్ట్ర సమస్యలపై బ్రహ్మండంగా మాట్లాడుతారు కానీ అధికారంలోకి రాగానే వారికి ఓ మత్తు ఆవహించి ప్రజా సమస్యలను మర్చిపోయి స్వార్ధంతో ఆలోచించే స్వభావాన్ని పొందుతారా? ఇది చాలా దురదృష్టకరమన్నారు. హోదా వల్ల లాభాలు లేకపోతే వెంకయ్య ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రధాని, ముఖ్యమంత్రి అభ్యర్థుల సాక్షిగా పుసక్తం వేసి మరీ నేనే ఛాంపియన్‌ అని ఎందుకు చెప్పుకున్నారని పార్థసారధి నిలదీశారు. అలా ఎందుకు చెప్పుకున్నారో ప్రజలకు వివరించాలని పట్టుపట్టారు. నిజంగా హోదా ఇవ్వలేక..టీడీపీ, బీజేపీ నేతలు తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ అంశాన్ని నీరుగార్చారని పార్థసారధి ఫైర్‌ అయ్యారు.

Back to Top