చంద్రబాబుది రక్త చరిత్ర

హైదరాబాద్‌: చంద్రబాబు పరిపాలనలో కొనసాగేదంతా రక్త చరిత్ర అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శిల్పా చక్రపాణిరెడ్డిపై టీడీపీ నేతలు కాల్పులు జరపడాన్ని ఆయన ఖండించారు. రౌడీషీటర్లకు గన్‌ లైసెన్స్‌లు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు పోలీస్‌ స్టేషన్‌లో తుపాకీని డిపాజిట్‌ చేయకుండా ఉంటే పోలీసులు ఎలా ఊరుకున్నారన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. నడిరోడ్డుపై కాల్పులు, వేట కొడవళ్లు పట్టుకొని తిరుగుతుంటే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అభిరుచి మ‌ధును వెంట‌నే అరెస్టు చేయాల‌ని, నంద్యాల‌లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొల్పాల‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top