నిరుద్యోగుల జీవితాలతో బాబు చెలగాటం

కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి కల్పిస్తామని ఓట్లు వేయించుకోని నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. నందవరం మండల పరిధిలోని గంగవరం గ్రామంలో శనివారం గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రజలకు ప్రజా బ్యాలెట్‌ పత్రాలను పంపిణీ చేశారు. ఇచ్చిన వంద హామీల్లో వేటిని నెరవేర్చారో ప్రజా బ్యాలెట్‌ పూరించడం ద్వార మీరే నిర్ణయించాలంటూ ప్రజలను కోరారు. గ్రామంలో పింఛన్లు, రేషన్‌కార్డులు, హౌసింగ్, రోడ్లు, డ్రైన్లు తదితర సమస్యలు వేధిస్తున్నాయని ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డితో స్థానికులు మొరపెట్టుకున్నారు. గతంలో అర్హులైన వారందరికీ పింఛన్లు వచ్చేవని, అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్లును రద్దు చేసిందని వాపోయారు. ఊర్లో మిద్దెలపై వేలాడుతున్న కరెంటు తీగలను తొలగించాలని అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందని స్థానికులు ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికార దాహం కోసం ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారని ఫైర్‌ అయ్యారు. గద్దెనెక్కాక హామీలనుlరవేర్చకుండా రాష్ట్రంలో ఆర్థికలోటు ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగభృతి కింద రూ. 2 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, పీఠం ఎక్కాక నిరుద్యోగభృతి ఊసే కనిపించడంలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి చరమగీతం పాడాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీఏ ధర్మకారి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ శివన్న, పార్టీ నాయకులు రాజేష్‌కుమార్, వెంకట్రామిరెడ్డి, జయరామిరెడ్డి, ్రçపహ్లాదరెడ్డి, సోమశంకర్‌రెడ్డి, రంగారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శివరామిరెడ్డి, ఆకుల ఉశేని, రామిరెడ్డి, పురుషోత్తం, మారెప్ప, దేవరాజు, శాంతిరాజు, రంగప్ప, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 
4న పూలచింతలో ..
నందవరం మండల పరిధిలోని పూలచింత గ్రామంలో ఈ నెల 5న  గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ సంపత్‌కుమార్‌గౌడ్, పార్టీ ప్రచార కార్యదర్శి పేట శ్రీనివాసరెడ్డి శనివారం తెలిపారు. రెండున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది శూన్యమన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వం గూర్చి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Back to Top