బాబు మోసం చేశాడు

‘గడప గడపకూ వైయస్‌ఆర్‌’ సమీక్ష సమావేశానికి హాజరైన పలు జిల్లాల నేతలు
ప్రజల కష్టాలు.. వారి సమస్యలపై ఆరా తీసిన జననేత
గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం విజయవంతంపై హర్షం
సర్కార్‌పై మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని నేతలకు వైయస్‌ జగన్‌ పిలుపు

హైదరాబాద్‌:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘‘గడప గడపకూ వైయస్‌ఆర్‌’’ కార్యక్రమంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నేతలతో  సమావేశమైన అధినేత వైయస్‌ జగన్‌ అక్కడి పరిస్థితులు.. ప్రజల సమస్యల గురించి ఆరా తీశారు. ‘‘గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం’’ విజయవంతంపై హర్షం వ్యక్తం చేసిన జననేత సర్కార్‌పై మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘‘గడప గడపకూ వైయస్‌ఆర్‌’’కార్యక్రమం సమీక్షా సమావేశానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం,కృష్ణా జిల్లాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగాలు పలువురు మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న ప్రారంభించిన ‘‘గడప గడపకూ వైయస్‌ఆర్‌’’ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు. ప్రజలు మాత్రం చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర స్థాయిలో  మండిపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి  అన్ని వర్గా ల ప్రజలను మోసం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం అని.. నిరుద్యోగ భృతి అని యువతతో పాటు ముసలివాళ్ల వరకు అందరినీ మోసం చేశారంటున్నారు. 

బాబు పథకాలపై ప్రజల ప్రశ్నిస్తున్నారు
‘‘గడప గడపకూ వైయస్‌ఆర్‌’’ కార్యక్రమానికి హాజరైన వైయస్‌ఆర్‌ సీపీ నేతలు కొలుసు పార్థసారధి, కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయ భాను, దూలం నాగేశ్వరరావులు మాట్లాడారు. బాబు పాలనపై ప్రజలు విసిగి పోయారని అంటున్నారు. తాము బాబు అవినీతి అక్రమాలపై ప్రజలకు చెప్పాలని పోతే తమకంటే ముందుగానే వాళ్లే బాబును ప్రశ్నిస్తున్నారని చెప్పారు. బాబు ఎన్నో పథకాలు చెప్పారని, అందులో ఒక్కటంటే ఒక్కటీ కూడా నెరవేర్చలేదని మండిపడుతున్నారన్నారు. రుణమాఫి దగ్గర నుంచి ఆడపిల్ల పుడితే రూ.25వేలు ఇస్తామన్న బాబు హామీల వరకు ఏవీ చేయలేదన్నారు.  
Back to Top