నాయీబ్రాహ్మణులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

చిత్తూరు: నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు క్షమాపణలు చేయాలని చిత్తూరు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా కన్వీనర్‌ గాయత్రీదేవి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ చిత్తూరు గాంధీ సర్కిల్‌లో నాయీ బ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. నాయీ బ్రాహ్మణుల ఆందోళనకు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. క్షురకుల పట్ల చంద్రబాబు తీరు దారుణమన్నారు. రౌడీయిజం చేస్తూ తాటతీస్తానంటారా..? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు. న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరిన వారికి స్పష్టమైన హామీ ఇవ్వాల్సింది పోయి.. బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. వెంటనే చంద్రబాబు వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. 
Back to Top