నవరత్నాల సభకు తరలిన వైయస్సార్‌సీపీ కార్యకర్తలు

గాండ్లపెంట: కదిరి నియోజకవర్గ వైయస్సార్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో కదిరి పట్టణంలోని దత్తా గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన ‘నవరత్నాల’ సభకు మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ పోరెడ్డిచంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పలు వాహనాల్లో తరలివెళ్లారు. ఈ సందర్బంగా మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలకు వాహనాలను ఏర్పాటు చేశారు. మండలంలోని సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీలు, అభిమానులు, కార్యకర్తలు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.

నంబులపూలకుంటః–కదిరి దత్త పంక్షన్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన నవరత్నాల సభకు మండలానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు తరలివెల్లారు. మండల కన్వీనర్‌ పాలగిరి ఫకృద్దీన్‌ ఆద్వర్యంలో ప్రతి బూత్‌ స్థాయి నుంచి 10 మంది సభ్యులు వెల్లినట్లు తెలిపారు. తరలివెల్లిన నాయకుల్లో డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ టి.జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ షామీర్‌భాషా, సర్పంచులు ఆదినారాయణరెడ్డి,శివారెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రామాంజుల్‌రెడ్డి, డైరెక్టర్‌లు బయ్యారెడ్డి, కేశవరెడ్డి, క్రిష్ణారెడ్డి, గెంగిరెడ్డి, హనుమప్ప తదితరులు వెళ్లారు.

Back to Top