వైయస్‌ఆర్‌ సంక్షేమ పాలనే నవరత్నాలు

పొదిలి: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌.రాజశేఖరరెడ్డి రెండు కళ్ల లాంటి అభివృద్ధి, సంక్షేమ పాలన మళ్లీ అందించేందుకే నవరత్నాల పథకాలను వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొస్తున్నారని ఎంపీపీ కె.నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు అన్నారు. కంభాలపాడు పంచాయతీలోని సాయిబాలాజీ నగర్‌లో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. వైయస్‌ఆర్‌ కుటుంబంలో మనమంతా భాగమవుతున్నందుకు గర్వించాలన్నారు. ‘అన్న వస్తున్నాడు.. మంచి రోజులు వస్తాయని’ ప్రతి గడపలోని అందరికీ తెలియచెప్పాలన్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా, డ్వాక్రా చెల్లెమ్మలకు ఆసరా, పెన్షన్‌లు రూ.2 వేలు, అమ్మఒడి చదువుల బడి, ప్రతి పేదవాడికి ఇల్లు, ఆరోగ్యశ్రీకి గత వైభవం, పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్, యుద్ధ ప్రాతిపదికన జలయజ్ఞం పనులు, మూడు దశల్లో మద్య నిషేధం లాంటి నవరత్నాల గురించి వారు వివరించారు. అనంతరం పలు కుటుంబాల వారిని వైయస్‌ఆర్‌ కుటుంబంలో సభ్యులుగా చేర్చారు. కార్యక్రమంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి, సర్పంచ్‌ల సంఘం గౌరవాధ్యక్షుడు డి.శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు పి.శ్రీనివాసరావు, చాగంరెడ్డి మాలకొండారెడ్డి, వెలుగోలు కాశీ, కందుల రాజశేఖర్, మందలపు శ్రీనివాసరెడ్డి, క్రిజన్‌సన్, దేరంగుల తిరుపతిరావు, వార్డు సభ్యులు ఈశ్వరరెడ్డి, కాంట్రాక్టర్‌ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top