నవరత్నాలు సభకు స్ధల పరిశీలన

ఆమదాలవలస:

 వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ఇంటింటికీ తీసుకువెళ్లాలని అందుకోసమే నియోజకవర్గ స్థాయిలో సభలు నిర్వహిస్తున్నామని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర హైపవర్‌ కమిటీ సభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తమ్మినేని సీతారాం అన్నారు. నియోజకవర్గస్థాయిలో ఈనెల 10వ తేదీన నిర్వహించు నవరత్నాలు సభ నిర్వహణ ఏర్పాట్లు కోసం ఆమదాలవలస పట్టణంలో రైల్వేస్టేషన్‌ వద్ద బుకింగ్‌ కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కింగ్‌ స్ధలాన్ని గురువారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. సభకు అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలు రైల్వేస్టేషన్‌ జంక్షన్‌ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్నాయని సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని నాయకులకు తెలియజేశారు. సభకు నియోజకవర్గం నలుమూలల నుండి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారని అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.   

Back to Top