నవరత్నాలుతోనే నవ్యాంద్ర అభివృద్ది

కొత్తూరుః  వైయ‌స్‌ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలుతోనే నవ్యాంద్ర ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందని వైయ‌స్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షరాలు రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని పారాపురంలో గురువారం మండల పార్టీ అధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో రెడ్డి శాంతి మాట్లాడుతూ... ఈ నెల 9 తేదిన పాతపట్నంలో నిర్వహించు నవరత్నాల సభను కార్యకర్తలు, భూతు కమిటి సభ్యులు, పార్టీ గ్రామ కమిటీలు సభ్యులు జయప్రదం చేయాలని కోరారు. నవరత్నాలుతోనే ప్రతి కుటుంబం లబ్దిపొందుతారని అన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు జగన్‌ వర్తింప చేస్తామని అన్నారు. నవరత్నాలు సభ విజయవంతం అయ్యేందుక ప్రతి కార్యకర్త సైనికుడులా పనిచేయాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి అభిమానులు, నాయుకులు హజరు కావాలని కోరారు. కార్య‌క్ర‌మంలో మండల పార్టీ కార్యదర్శి ఎం. తిరుపతిరావు, పార్టీ ఎస్సీ సెల్‌ కార్యదర్శి దూలి అప్పన్న, పార్టీ నేతలు పంకజదాసు, నాగేశ్వరరావు, శిమ్మయ్య, జగ్గారావులతో పాటు పలువురు పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు 

Back to Top