నవరత్నాలు విజయవంతం చేయాలి

బొబ్బిలి రూరల్‌ః నియోజకవర్గంలో 2,3 రోజులలో ప్రారంభించనున్న నవరత్నాల కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కోరారు. స్థానిక వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు(రాంబాబు) విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే బూత్‌కమిటీలు ఏర్పాటుపూర్తి అయిందని, కార్యకర్తలు,నాయకులు ఇంటింటికీ వెళ్లి జగన్‌ నవరత్నాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ పోల అజయ్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని మండలాలలో ప్రతీ గ్రామంలో కమిటీలు వేసామని, అన్ని గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని,జగన్‌ ముఖ్యమంత్రి కావడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. మాజీ జడ్పీటీసీ వాకాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ....సంక్షేమ రాజ్యం జగన్‌తోనే సాధ్యమని, నాయకులు వెళ్లిపోయినా ప్రజలంతా జగన్‌ వెంట ఉన్నారని, అందరం కష్టపడి పనిచేయాలని సూచించారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఇంటి గోపాలరావు మాట్లాడుతూ... బుధవారం నాటి నవరత్నాల సభ విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని ఎదిరించి ప్రతీగ్రామం నుండి కార్యకర్తలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నాయకులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో తూముల రామసుధీర్, పట్టణ అధ్యక్షులు సావు కృష్ణమూర్తినాయుడు, మండల అధ్యక్షులు డాక్టర్‌వెంగళ నారాయణరావు, పాలవలస ఉమాశంకరరావు,ఇంటి గోపాలరావు,రేజేటి విసు తదితరులు పాల్గొన్నారు.

Back to Top