10న వడ్డాదిలో నవరత్నాలు సభ

బుచ్చెయ్యపేట(విశాఖ‌): మండలంలో గల మేజర్‌ పంచాయతీ వడ్డాదిలో ఈ నెల 10వ తేదీన నవరత్నాలు సభను నిర్వహిస్తున్నట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తెలిపారు. సోమవారం ఆయన మండల కేంద్రం బుచ్చెయ్యపేటలో విలేకర్లుతో మాట్లాడుతూ నియోజకవర్గ స్ధాయిలో నిర్వహించే ఈ సభకి రోలుగుంట,రావికమతం,చోడవరం, బుచ్చెయ్యపేట నాల్గు మండలాల్లో ఉన్న సర్పంచ్‌లు,ఎంపీటీసీలు,ముఖ్య నాయకులు,బూత్‌ కమిటీ సభ్యులు,ముఖ్య కార్యకర్తలు తరలిరావాలన్నారు. పేద ప్రజలు సంక్షేమం కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్రవేశ పెట్టిన నవరత్నాల ప‌థ‌కాల‌ను  ప్రజల్లోకి తీసికెళ్లడానికి ముందుగా వడ్డాదిలో నవరత్నాలు సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలనను తీసికెళ్లడమే కాక గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులు,డ్వాక్రా రుణాలు మాఫీ అనిచెప్పి ఏ విధంగా మోసం చేసినది,నిరుధ్యోగ భృతి అని,ఇంటికో ఉధ్యోగం ఇస్తామని చెప్పి నిరుధ్యోలను,చదువుకుంటున్న యువకులను మోసం చేసిన తీరు ఇతర పధకాల్లో నిరు పేదలకు జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లోకి తీసికెళ్లడమే కాక వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నవరత్నాలు పధకాలు వల్ల కలిగే ప్రయోజనాలను అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తామన్నారు.

తాజా ఫోటోలు

Back to Top