ప్రజల ముఖాల్లో చిరునవ్వుల కోసమే నవరత్నాలు

పశ్చిమ గోదావరి : ప్రజా సంకల్ప
యాత్రలో భాగంగా గణపవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోఉంగుటూరు నియోజకవర్గ సమన్వయ కర్త వాసుబాబు మాట్లాడారు. ఎందరో
వర్గాలు, కులాలను కలుసుకుంటూ వైయస్‌ జగన్‌ ఇప్పటికే 2100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చారన్నారు. వైయస్‌ జగన్‌
పడుతున్న శ్రమను చూసి గర్వపడుతున్నారని చెప్పారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు
చూసేందుకు నవరత్నాలు ప్రకటించారన్నారు. మన ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన
ఆధారమన్నారు. అయితే టీడీపీ పాలనలో రైతులకు ఎలాంటి సాయం అందడం లేదన్నారు. సాగునీరు, తాగునీటికి తీవ్ర
ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇక్కడి నీటిని చంద్రబాబు వేరే ప్రాంతాలకు
తరలించుకుపోతున్నారన్నారు. 

Back to Top