నవరత్నాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మంగళగిరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచించారు. మంగళగిరి నియోజకవర్గ నవరత్నాల సభను పట్టణంలోని గౌతమ బుద్ధారోడ్‌లోని ఈద్గా మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆర్కే, రాష్ట్ర కార్యదర్శి లావు కృష్ణదేవరాయలు పాల్గొని దివంగత మహానేత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ బూత్‌ కమిటీ సభ్యులకు, కార్యకర్తలకు నవరత్నాల పథకాలపై వివరించారు. అంతకుముందు బూత్‌ కమిటీల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top