ఆడ‌ప‌డుచుల ఆశీర్వాదం- జ‌న‌నేత‌కు హార‌తి ప‌ట్టి..ఆత్మీయ స్వాగ‌తం
 - డ్వాక్రా గ్రూపుల‌ను ఆదుకోవాల‌ని విన్న‌పం
- అన్న‌గా తోడుంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ
 
అమ‌రావ‌తి:  ప్ర‌జా సమ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌హిళ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంది. అన్నొచ్చాడ‌ని ఆడ‌ప‌డుచులు ప‌నులు మానుకొని ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. అన్నా..మీరే మాకు అండ అంటూ అడుగులో అడుగులు వేస్తున్నారు. త‌మ గ్రామానికి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌హిళ‌లు తిల‌కం దిద్ది, హార‌తి ప‌డుతున్నారు.  మేమంతా నీ వెంటే అంటూ ఆశీర్వ‌దించి ముందుకు సాగ‌నంపుతున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. మ‌హిళ‌లు, యువ‌కులు, చిన్న‌పిల్ల‌లు మిద్దెల‌పై ఎక్కి జ‌న‌నేత‌ను చూసి మురిసిపోయారు. ఆయా వీధుల్లో వైయ‌స్ జ‌గ‌న్ మ‌హిళ‌లు, వృద్ధుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.

అదేస్ఫూర్తి..ఆదే ఆద‌ర‌ణ‌..
గ‌తేడాది న‌వంబ‌ర్ 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్రారంభం రోజు నుంచి ఇవాళ్టి వ‌ర‌కు ఎక్క‌డికి వెళ్లినా మ‌హిళ‌లు ముందుండి ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఏ ఊరికి వెళ్లినా అన్నా..నీవే మాకు దిక్కు అంటూ త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామ‌ని చంద్ర‌బాబు ఓట్లు వేయించుకొని మోసం చేశాడ‌ని, బ్యాంకుల్లో పావ‌లా వ‌డ్డీకి రుణాలు అంద‌డం లేద‌ని, బ్యాంకుల నుంచి నోటీసులు వ‌స్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆడ‌బిడ్డ పుడితే రూ.50 వేలు ఇస్తామ‌ని, పెళ్లిళ స‌మ‌యంలో డ‌బ్బులు చెల్లిస్తామ‌ని మాట ఇచ్చిన చంద్ర‌బాబు మోసం చేశాడ‌ని మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్ ఎదుట వాపోతున్నారు. పింఛ‌న్లు కావాల‌ని కోరితే నీవు మా పార్టీ కాదుపో..నీకు రేష‌న్‌కార్డు ఇవ్వ‌మ‌ని వేధిస్తున్నార‌ని మహిళ‌లు జ‌న‌నేత‌కు వివ‌రిస్తున్నారు. చివ‌ర‌కు వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్డి మంజూరు చేయ‌మ‌ని కోరితే జ‌న్మ‌భూమి క‌మిటీలు లంచం అడుగుతున్నార‌ని రాజ‌న్న బిడ్డ‌కు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. వ్య‌వ‌సాయ కూలీలు త‌మ‌కు క‌నీస కూలి రావ‌డం లేద‌ని, ఉపాధి ప‌థ‌కంలో చేసిన ప‌నుల‌కు బిల్లులు ఇ వ్వ‌డం లేద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఇల్లు, ఇళ్ల స్థ‌లాల ఊసే లేద‌ని, పాడి ప‌రిశ్ర‌మ‌కు స‌రైన ప్రోత్సాహం లేద‌ని, మీరే ఆదుకోవాల‌ని అక్కా చెల్లెమ్మ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు విన‌తులు ఇస్తున్నారు. మ‌హిళా ఉద్యోగులు, ఆశా వ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు ఇలా అన్ని వ‌ర్గాల మ‌హిళ‌లు పాద‌యాత్ర పొడ‌వునా  త‌మ బాధ‌లు జ‌న‌నేత‌కు చెప్పుకొని స్వాంత‌న పొందుతున్నారు. వారి స‌మ‌స్య‌లు ఓపిక‌గా వింటున్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేస్తాన‌ని, ఉద్యోగాల్లో, ఉపాధిలో 50 శాతం మ‌హిళ‌ల‌కు ద‌క్కేలా చూస్తామ‌ని మాట ఇస్తున్నారు.   

 
అందరికీ చెప్పండి
‘నవరత్నాల గురించి మా అన్న చెప్పాడని అందరికీ చెప్పండి.. ఓ అవ్వా.. నా మనవడు చెప్పాడని అందరికీ చెప్పు... అమ్మా.. నా కొడుకు చెప్పాడని చెప్పండి.. దేవుడి ఆశీస్సులు, మీ అందరి సహకారంతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా నవరత్నాలను అమలు చేస్తామని చెప్పండి. పేదలందరినీ ఆదుకుంటామని కూడా చెప్పండి’ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  రామాపురం వద్ద తనను కలిసిన మహిళలతో ఆయన మాట్లాడారు. ‘మన చిట్టి పిల్లలను బడులకు పంపిస్తే.. ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు ఇస్తాం. పెద్ద పెద్ద చదువులకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది. పైగా వారి హాస్టల్‌ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాం. అవ్వాతాతల పింఛన్‌ వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటాం. అర్హత వయసు తగ్గించడం వల్ల ఇంకా ఎక్కువ మందికి మేలు జరుగుతుంద‌ని చెప్పారు. 

నాలుగు విడ‌త‌ల్లో రుణాలు మాఫీ
మనందరి ప్రభుత్వం రాగానే ఎన్నికల నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణం ఎంత ఉందో ఆ మొత్తాన్ని నాలుగు విడతలుగా వారి చేతికే నేరుగా అందిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మాట ఇచ్చారు. గత ప్రభుత్వాల్లో సున్నా వడ్డీకే మహిళలు, రైతులకు రుణాలు లభించేవి. ఎలా వచ్చేవంటే వారు తీసుకునే రుణాలపై వడ్డీని ఆ ప్రభుత్వాలే బ్యాంకులకు చెల్లించేవి కనుక. కానీ చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ మొత్తాన్ని కట్టడం మానేసింది. అందుకే బ్యాంకులు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు. మనందరి ప్రభుత్వం రాగానే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. అప్పుడు బ్యాంకులు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది’ అని వైయ‌స్ జగన్‌ చెప్పారు. ఈ విషయాలన్నింటినీ అందరికీ వివరించాలని కోరారు. 

చెప్పింది చేస్తా..చేసేదే చెబుతా
తాను చెప్పింది చేస్తాన‌ని, చేసేది చెబుతానని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.  వైయ‌స్ జగన్‌ అబద్ధం ఆడడు. వైయ‌స్ జగన్‌ మోసం చేయడు... వైయ‌స్ జగన్‌ మాట ఇస్తే తప్పడు. వైయ‌స్ జగన్‌ ఏదైనా చెబితే చేస్తాడు అన్న విశ్వసనీయ రాజకీయాలే నాకు ఉన్న బలం’’ అని ఆయన వివరించారు. అహంకారంతో చంద్రబాబుకు కళ్లు నెత్తికి ఎక్కాయి. డబ్బుతో ఎమ్మెల్యేల మాదిరిగా ప్రజలనూ కొనవచ్చునని అనుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పాల‌ని సూచించారు. చెడిపోయిన వ్య‌వ‌స్థ‌లో మార్పు కోసం బ‌య‌లుదేరిని త‌న‌కు తోడుగా నిల‌వాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ మ‌హిళ‌ను కోరారు.
Back to Top