ప్రతి ఇంటికీ నవరత్నాలు

ఖాజీపేట:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ప్ర‌క‌టించిన నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తున్న‌ట్లు బి.కొత్తపల్లె మాజీ సర్పంచ్‌ నాగిరెడ్డి తెలిపారు. బి.కొత్తపల్లె గ్రామంలో శనివారం రెండవ రోజున వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. గ్రామంలోని వైయ‌స్ఆర్‌ విగ్రహానికి కొండయ్య,  పుల్లమ్మ దంపతులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలో సుమారు 35 కుటుంబాలను కలిశారు. వారికి నవరత్నాలు పథకాలను వివరించి పార్టీ సభ్యత్వం తోపాటు ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనలో అందరికీ న్యాయం జరగడం లేదని అన్నారు. కేవలం పచ్చచొక్క‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయ‌ని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో పార్టీకలకు అతీతంగా ప్రతిపేద వానికి మేలు చేశారని అన్నారు. అందుకే  వైయ‌స్‌ జగన్‌ సిఎం అయితే అందరికి న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.  కార్యక్రమంలో శ్రీనివాసుల రెడ్డి ఎల్లయ్య సుబ్బరాయుడు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top