పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ అమలాపురం కోఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్‌ అన్నారు. అమలాపురం నియోజకవర్గ నవరత్నాల సభను పట్టణంలోని సూర్యనగర్‌ వాసర్ల వెంకన్న కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పినిపే విశ్వరూప్, పార్టీ సీజీసీ సభ్యుడు కుడిపూడి చిట్టబ్బాయిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నవరత్నాలపై అవగాహన కల్పించారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. 

Back to Top