ప్రతి ఇంటికి నవరత్నాలు

ఖాజీపేట:  దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖర్‌రెడ్డి పార్టీలకతీతంగా ప్రతి కుటుంభానికి సంక్షేమ ఫలాలు అందించారని, ఆయ‌న బాట‌లోనే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా న‌వ‌ర‌త్నాలు వంటి ప‌థ‌కాల‌ను అందిస్తార‌ని బి.కొత్తపల్లె మాజీ సర్పంచ్‌ నాగిరెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాన్ని నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు సుమారు 50కుటుంబాలను కలిశామ‌న్నారు. ప్ర‌తి ఇంటిలో కూడా న‌వ‌ర‌త్నాల గురించి చెప్పామ‌ని, చంద్ర‌బాబు పాల‌న‌కు మార్కులు వేయించామ‌న్నారు. ఏ ఇంటికి వెళ్లినా ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. కార్యక్రమంలో పార్టీ బూత్ క‌మిటీ నాయ‌కులు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి సుధాకర్‌రెడ్డి ఎల్లయ్య చంద్రశేఖర్‌రెడ్డి జెసీ చంద్ర పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top