నవరత్నాల‌తో ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్‌.శివప్రకాష్‌ రాజు

పాలసముద్రం:

 వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు జీవితాల్లో వెలుగు వ‌స్తుంద‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్‌.శివప్రకాష్‌ రాజు అన్నారు. గురువారం రాచపాల్యం పార్టీ కార్యకర్తలతో కలసి ఇంటింటికి తిరిగి నవరత్నాల వల్ల ప్రయోజనాల కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయ‌స్ఆ ర్‌ రైతు భరోసాతో సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకు రూ 50 వేలు రైతులకు అదింస్తారని, రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల రైతు కుటుంబాలతో 86 శాతం కుటుంబాలకు ఈ పథకం లాభం చేకూర్చుతుంది. టీడీపీ మూడున్నడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు అనేక మార్లు వాచ్చరు తప్పితే జిల్లాకు చేసింది మాత్రం శూన్యం. నందాల ఉన్న ఎన్నికల్లో గెలుపై విర్రవీగుతున్న బాబు రూ 150 కోట్లు ఖర్చు పెట్టి ఓటర్లను బెదిరించి ఓట్లు వేసుకుని గెలుపొందడం ఒక గెలుపా అని విమర్శించారు. 2019 ఎన్నికల్లో అదే నందాల్లో టీడీపీ గెలుస్తారా గెలవదు, వైయ‌స్ఆర్‌  సీపీ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుబ్రమణ్యరెడ్డి, ఉపాధ్యక్షులు అన్భ్‌లగన్, పద్మనాధనాయులు, యూత్‌ అధ్యక్షుడు దనంజయులు, నాయకులు మురళి, ఇళయరాజ్‌ తదితర పార్టీ నాయకలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top