ఇంటింట నవరత్నాల ప్రచారం

సుండుపల్లి: మండలంలోని వైఎన్‌పాలెం, కుంటలముందర, భాగంపల్లి, కొండలతూర్పు, రాయవరం, మాచిరెడ్డిగారిపల్లి, సుండుపల్లి పట్టణకేంద్రం పలుప్రాంతాల్లో వైయస్సార్‌సీపీ వైయస్‌ కుటుంబం, నవరత్నాలు ప్రచారం బూతులెవల్‌ కన్వీనర్లు, కమిటీసభ్యులు ఇంటింటికివెల్లి ప్రచారంచేస్తూ మహాయజ్ఞంలా చేపట్టారు. 43 బూతులలో వాడవాడలా తిరిగి దివంగత రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమపథకాల గురించి తెలియజేశారు. అలాగే చంద్రబాబు నెరవేర్చని హామీలు గురించి కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ నాయకులు అనందరెడ్డి, ఎంపీపీ అజంతమ్మ, సిరాజుద్దీన్, సంజీవరెడ్డి, గంగిరెడ్డి, చిన్నప్ప, సూరి, క్రిష్ణమరాజు, ఆరంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top