నవరాత్నాలతో సుపరిపాలన - ఎమ్మెల్యే కోన రఘుపతి

గుంటూరు(బాపట్ల):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందిస్తార‌ని ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి తెలిపారు.  నవరత్నాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఈనెల 10వ తేదిన బూత్‌కమిటిలకు, వివిధ అనుబంధసంఘాల నాయకుల‌కు స్థానిక ఎమ్మెస్సార్‌ కళ్యాణమండపంలో శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. గురువారం స్థానిక కోన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని మండిప‌డ్డారు.  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖర్‌రెడ్డి పాలన తిరిగి రావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారని, పలు పథ‌కాల‌తో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథ‌కాలను ప్రవేశపెట్టారని వివరించారు. ఆరోగ్యశ్రీ నుంచి ఫీజురీయిబర్స్‌మెంట్‌ వరకు అనేక సంక్షేమ పథ‌కాలను ప్రజలకు చేరువచేసేందుకు పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.   వైయ‌స్ ఆర్  కుటుంబంలో సభ్యులు అయ్యేందుకు 9121091210 మిస్డ్‌కాల్‌ ఇస్తే కుటుంబ సభ్యులుగా నమోదు చేసుకుంటారని ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. స‌మావేశంలో పార్టీ  మండల అధ్యక్షులు దొంతిబొయిన సీతారామిరెడ్డి, మారం రామకోటేశ్వరరావు,ఆర్‌.వెంకటప్పయ్య, పిన్నిబోయిన వెంకటేశ్వర్లు,మోర్ల సముద్రాలగౌడ్,జోగిరాజా,అడే చందు ఉన్నారు.

Back to Top