నవరత్నాల సభ‌ను విజయవంతం చేయాలి

సీతానగరం

:  పార్వతీపురంలో నిర్వహించనున్న నియోజకవర్గస్థాయి నవరత్నాల సభ‌ను విజయవంతం చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గర్భాపు ఉదయభాను కోరారు. శుక్రవారం మండలం లోని అంటిపేట, లచ్చయ్యపేట చినబోగిలి, గాదెలవలస, జానుమల్లువలస, తామరఖండి, వెంకటాపురం, వి బి పేట దయానిధిపురం,ఏగోటివలస అనంతరాయుడుపేట గ్రామాల్లో కార్యకర్తలను కలిసి పార్వతీపురంలో జరుగు నవరత్నాల సదస్సుకు పార్టీఅభిమానులు, కార్యకర్తలు హాజరవ్వాలని కోరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మహానేత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథ‌కాల‌రె స్పూర్తిగా తీసుకుని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాల పథకాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నేతలు రాఘవకుమార్, జి లక్ష్మణరావు, మండల నేతలు పోల ఈశ్వర నారాయణ, ఆర్నెపల్లి శివున్నాయుడు, శాస్త్రి, ధనంజయ్,ఎన్‌ వెంకయ్య పాల్గొన్నారు.

Back to Top