నవరత్నాల సభకు తరలిరండి

శ్రీ‌కాకుళం: పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో శనివారం సాయంత్రం 3 గంటలకు జరగనున్న నవరత్నాల సభకు అధిక సంఖ్యలో తరలి రావాలని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన  సమావేశంలో ఆమె మాట్లాడుతూ..న‌వ‌ర‌త్నాల స‌భ‌లో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించిన నవరత్నాలు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహాన కల్పించనున్నామని పేర్కొన్నారు.  నియోజకవర్గం నలుమూలల నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్‌ కిలారి త్రినాథరావు, నాయకులు ఎర్ర జనార్దన, పెనుమజ్జి విష్ణు, లోచర్ల మల్లేశ్వరరావు, కొల్ల కృష్ణ, ఎంవీ రమణ, బొట్ట శ్రీనివాసరావు, మెండ వాసు, తూలుగు కృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top