నవమి శుభాకాంక్షలు తెలిపిన విజయమ్మ

హైదరాబాద్, 18 ఏప్రిల్ 2013:

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్రానంతరం దేశంలో రామరాజ్యం ఏర్పడాలని మహాత్మా గాంధీ కలలు కన్నారని ఆమె గుర్తుచేశారు. ఆకలికి, పేదరికానికీ తావులేని సంక్షేమ రాజ్యానికి రామరాజ్యం ప్రతీకని ఆమె వివరించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందే అలాంటి రామరాజ్యం , పల్లెలు పట్టుగొమ్మలైన గ్రామరాజ్యం ఆవిష్కృతం కావాలని ఆమె అభిలషించారు. శ్రీరాముడు ఒకే మాటకు ప్రతీకనీ, సీతారాముల అపకచెపకచ దాంపత్యం, శ్రీరామలక్ష్మణుల సోదరా ప్రేమ అందరికీ ఆదర్శం కావాలని శ్రీమతి విజయమ్మ సూచించారు.

తాజా వీడియోలు

Back to Top