అధికార పార్టీ నేతలు తీరు హాస్యాస్పదం

()అనని మాటలను అన్నట్లుగా చూపండం సమంజసం కాదు
()చట్టాలను గౌరవిస్తాం గనుకే కమిటీ ముందు హాజరయ్యాం

హైద‌రాబాద్‌:  గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌లో జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల్లో తమ ఎమ్మెల్యేలు అన్‌పార్ల‌మెంటరీ లాంగ్వేజ్‌తో మాట్లాడార‌ని ...అధికారపార్టీ నేతలు చెప్ప‌డం హ‌స్య‌ాస్ప‌దంగా ఉంద‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌దర్‌రెడ్డిలు  అన్నారు. సభా హక్కుల కమిటీ భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అస‌భ్య ప‌ద‌జాలం మాట్లాడ‌ారని పేర్కొంటూ బుద్ధ‌ప్ర‌సాద్ క‌మిటీ తనను పిలిచిందని ... అందులో ఉన్న మాట‌లు తాను మాట్లాడిన‌వి కావ‌ని స‌మాధాన‌మిచ్చానన్నారు.

తాను కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేన‌ని, స‌భ‌లోకి రాక‌ముందు నుంచే ఎన్నో ఏళ్లుగా వైఎస్సార్ కుటుంబంతో అనుబంధం ఉంద‌న్నారు. అటువంటి మా నాయ‌కుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని.... నేర‌స్తుడ‌ని, స‌భ‌లోనే పాతేస్తామ‌ని వ్యాఖ్య‌ానిస్తే ఎలా ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. టీడీపీ వారు బ‌హిరంగంగా మాట్లాడితే తాను మాత్రం పోడియం వ‌ద్ద మాత్ర‌మే ఒక‌టి, రెండు మాట‌లు అన్నానని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చ‌ట్టాల‌ను గౌర‌విస్తుంద‌ని, అందుకే క‌మిటీ ముందుకు హ‌జ‌ర‌య్యామ‌న్నారు. తాము ఎలాంటి విమర్శలు చేయమని, అధికార శాస‌న‌స‌భ్యులు కూడా విమ‌ర్శ‌లు చేయ‌కూడ‌ద‌ని క‌మిటీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.  రెండు చేతులు క‌లిస్తేనే చ‌ప్ప‌ట్లు అని వాఖ్య‌ానించారు. 

సైకో పార్టీ అన్నారు
గ‌త శాస‌న‌స‌భా స‌మావేశాల్లో మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్‌సీపీని సైకో పార్టీ అని దుషించార‌ని... దానికి తాను త‌గిన రీతిలో స‌మాధానం చెప్పాన‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోడాలి నాని అన్నారు.  ఆవేశంతో కొన్ని మాట‌లు మాట్లాడింది వాస్తవమే అయినా...తాను మాట్లాడిన మాట‌లు నెట్‌లో వేయడం తగదన్నారు.  ఒక‌ప్పుడు  అచ్చెన్నాయుడు, తాను మంచి స్నేహితులమని.... అచ్చెన్నాయుడుకు క్ష‌మాప‌ణ చెప్పిన విష‌యం క‌మిటీకి వివ‌రించాన‌న్నారు. అయినా క‌మిటీ నా వివ‌ర‌ణ కోర‌డంతో, అచ్చెన్నాయుడికి చెప్పిందే ఇప్పుడు క‌మిటీకి చెబుతున్నాన‌ని వివ‌రించారు. 

ఇది మంచిపద్ధతి కాదు
శాస‌న‌స‌భ‌లో అన్ పార్లమెంటరీ పదాలను తాను ఎప్పుడు వాడలేదని, ఇకముందు ఎప్పుడూ వాడబోనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో తానెలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయలేదని బుద్ధప్రసాద్ కమిటీకి చెప్పానన్నారు. తాను అనని వ్యాఖ్యలను అన్నానని మాట్లాడడం సమంజసం కాదన్నారు. 
Back to Top