బాబు సర్కార్ ను ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం

తిరుపతి : అసెంబ్లీలో ప్రజాస్వామ్యం మంట గలిసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సునీల్ లు ఆరోపించారు. సభలో  అధికార పక్షం ప్రతిపక్షం గొంతు నొక్కేస్తుండడంతో...ప్రజా సమస్యలు ప్రస్తావించలేకపోతున్నామని వారు తిరుపతిలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే చంద్రబాబు ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఎమ్మెల్యే రోజా పట్ల  ప్రభుత్వం వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ఇది ఏపీ మహిళలందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజల వద్దకే వెళ్తామని ఎమ్మెల్యేలు  స్పష్టం చేశారు. చంద్రబాబు సర్కార్ను క్షేత్రస్థాయిలో ఎండగడతామన్నారు.
Back to Top