చేతకాని మంత్రిని తప్పించండి

నెల్లూరు : రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయ‌ణ‌ను త‌ప్పించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్లోర్ లీడ‌ర్ రూప‌కుమార్‌యాద‌వ్ డిమాండ్ చేశారు. మంత్రి సొంత జిల్లాలోని కార్పొరేషన్‌ను అభివృద్ది చేయలేని, చేతకాని మంత్రిని సీఎం చంద్రబాబునాయుడు తప్పించాలని కోరారు. నగర పాలక సంస్ధ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో రూప్‌కుమార్‌ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌లు కోట్ల‌ రూపాయలు నిధులు తీసుకొచ్చామని ప్రకటనలు చేశారన్నారు. అయితే ఏడాది క్రితం జీఓ నెం 101 క్రింద రూ.36 కోట్లు విడుదలైన నిధులను ఖర్చు చేయలేకపోయారన్నారు.ప్రస్తుతం ఆ నిధులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇటీవల ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ. 60 కోట్లు విడుదలయ్యాయని మేయర్‌ అజీజ్‌ అధికార పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారన్నారు. అయితే ప్రస్తుతం ఆ నిధులు గుంటూరు, కృష్ణా జిల్లాలకు మళ్ళించారన్నారు. అధికార పార్టీలో వర్గవిభేదాలు కారణంగా అభివృద్ది పనులు జరగట్లేదని మండిపడ్డారు. వాటాల్లో సర్దుబాటుకాçకపోవడంతోనే పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. అభివృద్ది చేయాలని ప్రతిపక్ష పార్టీగా తాము ప్రశ్నిస్తే అభివృద్దిని అడ్డుకుంటున్నారని విమర్శించడం దారుణమన్నారు.
తగిన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారు...
ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. ప్రతిపక్షం అంటే విలువలేదు, పత్రికల్లో వచ్చే వార్తల పై చలనం లేదన్నారు. కార్పొరేషన్‌లో ఎన్నడూ లేని విధంగా అవినీతి పేట్రేగిపోతుందని అన్నారు. జిల్లాకు చెందిన నారాయణ మున్సిపల్‌ శాఖ మంత్రిగా అవకాశం కల్పిస్తే, సొంత జిల్లాలోని కార్పొరేషన్‌ను అభివృద్ది చేయడంలో విఫలమయ్యారన్నారు. చేతకాని మంత్రిని తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పార్టీ విప్‌ బొబ్బల శ్రీనివాసులుయాదవ్, కార్పొరేటర్‌లు రవిచంద్ర, దేవరకొండ అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు,  వందవాశిరంగ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top