రెండోరోజు కొనసాగుతున్న నారాయణరెడ్డి దీక్ష

అనంతపురం: టీడీపీ నేతల అవినీతిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్మవరం కౌన్సిలర్‌ చందమూరు నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ సమావేశంలో అవినీతిపై ప్రశ్నించినందుకు నారాయణరెడ్డిని పాలకవర్గం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఆయన ధర్మవరం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. రెండో రోజు నారాయణరెడ్డి దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. అవినీతిపై విచారణ జరిపించే వరకు పోరాటం ఆగదని నారాయణరెడ్డి అన్నారు. 
Back to Top