నారా రాక్షసుల వల్లే ఈ దుష్టపాలన

టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన తప్పేంటి
పుష్కరాల ముసుగులో ఆలయాలను కూల్చిన ఘనుడు చంద్రబాబు
విజయవాడ కార్పొరేషన్‌ అవినీతిలో కూరుకుపోయింది
ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసిన మేయర్‌ క్షమాపణ చెప్పాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: నారావారి రాక్షసులకు దేవుడంటే భయం, భక్తి లేకుండా పోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. నారా రాక్షసుల వల్లే రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోతుందన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. స్వామివారి కైంకర్యాల్లో అపచారాలు చోటుచేసుకుంటున్నాయని ప్రశ్నించిన రమణదీక్షితులుపై వయోపరిమితి పేరుతో చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు రంగరాజన్‌ కూడా రమణ దీక్షితులు చేసిన తప్పేంటని ప్రశ్నించారని, ఆయన మనవడిని ఆలయానికి తీసుకెళ్తే తప్పా.. చంద్రబాబు తన మనవడిని ఉగాది పండగకు ఆలయానికి తీసుకురావచ్చా.. అర్చకుల మనవళ్లకు అర్హత లేదా అని నిలదీశారన్నారు. దీనిపై చంద్రబాబు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

విజయవాడలో పుష్కరాల మనుగులో అనేక దేవాలయాలను నేలమట్టం చేసిన ఘనుడు చంద్రబాబు అని వెల్లంపల్లి మండిపడ్డారు. దోపిడీ, అక్రమాలకే ఆయన పనిచేస్తున్నారని, దుర్గమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేస్తే ఈఓను బదిలీ చేశారు కానీ పూజలు చేసిన వారిని గుర్తించి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. టీటీడీలో అరాచకంగా తీసుకున్న నిర్ణయాలు, నిజాలు బయటపెట్టిన రమణ దీక్షితులపై చర్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తప్పకుండా టీడీపీ ప్రభుత్వం చేసే పాపలు కడిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైయస్‌ జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. 

విజయవాడ నగర పాలక సంస్థ నాలుగేళ్ల పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని వెల్లంపల్లి విమర్శించారు. పుష్కరాల్లో ఖర్చు చేసిన వందల కోట్ల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అభివృద్ధి పేరుతో నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నారని, విజయవాడలో బందర్‌రోడ్డు, ఏలూరు రోడ్డు తప్ప మిగిలిన వన్నీ చెత్తాచెదారం.. మురుగుతో దర్శనమిస్తున్నాయన్నారు. వీటిని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పుకుంటున్నారన్నారు. కృష్ణానదిని పక్కనబెట్టుకొని తాగునీరు ఇవ్వలేని దుర్మార్గపు పాలన చంద్రబాబుదన్నారు. ప్రత్యేక హోదాపై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తీర్మానం చేశామని టీడీపీ ప్రజలను మోసం చేస్తుందని, ఇన్నాళ్లు ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించిన వైయస్‌ఆర్‌ సీపీ కార్పొరేటర్‌లను ఎందుకు సస్పెండ్‌ చేశారని ప్రశ్నించారు. అవినీతిపై మాట్లాడితే చర్యలు తీసుకుంటారా..? 
నగర పాలక సంస్థలో ఆస్తులు కాపాడగలిగామంటే. వైయస్‌ఆర్‌ సీపీ కార్పొరేటర్‌ల వల్లేనని, ప్రభుత్వ భూములను కార్పొరేషన్‌ ప్రైవేట్‌పరం చేయడానికి పూనుకుంటే వైయస్‌ఆర్‌ సీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారన్నారు. సభ్యులను సస్పెండ్‌ చేసిన మేయర్‌ వారికి క్షమఫలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top