నంద్యాలలో గెలుపు వైయస్సార్ సిపిదే!

మంత్రాలయం రూరల్‌ : 
వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నిల్లో గెలిచి మంత్రి పదవులు అనుభవిస్తున్న వారితో వెంటనే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్దం కావాలని వైయస్సార్‌ సీపీ రాష్ట్ర యూత్‌ కమిటీ సభ్యులు వై.ప్రదీప్‌రెడ్డి డిమాండ్ చేశారు.  సోమవారం  విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు విఖ్యాత్‌రెడ్డి, అడ్వకేట్‌ గురురాజ, హోటల్‌ పరమేష్, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
Back to Top