బాబు పాలనపై పగ తీర్చుకోండి

  • ఉప ఎన్నికలో గెలుపు కోసం కుట్రలు, కుతంత్రాలు
  • ఏపీ మంత్రులు సచివాలయాన్ని వదిలేశారు
  • ఓటర్లను మాయ మాటలతో మభ్యపెడుతున్నారు.
  • మూడున్నరేళ్లలో నంద్యాలకు ఏం చేశారు బాబూ?

  • నంద్యాల: చంద్రబాబు మూడేళ్ల పాలనపై 6 కోట్ల ఆంధ్రులలో పగ తీర్చుకునే అవకాశం నంద్యాల ప్రజలకే దక్కిందని, ఉప ఎన్నికలో ఓటుతో కసిగా బుద్ధి చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. నంద్యాలలో భూమన మీడియాతో మాట్లాడారు. మూడేళ్ల పాలనలో నంద్యాల ఏ నాడు కూడా చంద్రబాబుకు గుర్తుకు రాలేదని, భూమా నాగిరెడ్డి మరణాంతరం, ఇక్కడి ప్రజలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తున్నారని గ్రహించి మాయమాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఓటర్లను ప్రలోభపరిచే కార్యక్రమాలు చేస్తూ, నాయకులను బెదిరిస్తూ, కిడ్నాప్‌నకు వెనుకాడకుండా, అశాంతిని నెలకొల్పుతూ, ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి, ప్రజలు మాకు మద్దతు ఉన్నారని చాటుకోవాలని టీడీపీ చూస్తోందన్నారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా కుట్రలమయం  అని విమర్శించారు. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే ఆయన లక్ష్యమన్నారు. అత్యంత దారుణమైన, దుర్భరమైన వాతావరణంలో నంద్యాల వాసులు సందుల్లో, గొందుల్లో నివాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు కన్నెత్తి చూడని చంద్రబాబు ఈ రోజు ఉప ఎన్నిక ఉందని ఇక్కడి వచ్చారని మండిపడ్డారు. ఓట్ల కోసం నంద్యాలను నందనవనంగా మార్చుతున్నానని మాయమాటలు చెబుతున్నారని ఫైర్‌అయ్యారు. 13 ఏళ్ల పాటు అధికార పీఠంపై ఉన్న  బాబు ఇవాళ గ్రామ గ్రామానికి వస్తున్నారంటే ఆయనకు ఎంతలా ఓటమి భయం పట్టుకుందో అర్థమవుతుందన్నారు. నంద్యాల ఓటర్లను ప్రలోభపెడుతున్నారని నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల్లో  నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను మోసం చేశారని, భూములను ఆక్రమించి, ఇసుకను అమ్మి, బ్రాందీ షాపుల ద్వారా అక్రమార్జన చేసి ఆ సంపాదనతో నంద్యాలలో అభివృద్ధితో కాకుండా అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. నా అవినీతి సొమ్ము మీకు ఖర్చు పెడుతానని ప్రజలను కూడా మలినం చేయడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నులో భయం పుట్టుకొని సచివాలయంలో ఉండాల్సిన మంత్రులను నంద్యాలకు పంపించారని, వారు కార్పొరేటర్ల కంటే హీనంగా సందుల్లో తిరుగుతూ బ్రోకర్లుగా మారిపోయారన్నారు. ప్రజలారా..ఈ ఎన్నిక చంద్రబాబు 6 కోట్ల మంది ప్రజలకు చేసిన ద్రోహానికి పగ తీర్చుకునే అవకాశం నంద్యాల ప్రజలకు వచ్చిందన్నారు. మోసానికి, దాష్టికానికి, కుట్రలకు పగ తీర్చుకునే మొదటి అవకాశం నంద్యాల ప్రజలకే వచ్చిందని గుర్తు చేశారు. ఓటుతో కసి తీర్చుకోండి. వెలుగెత్తి చాటండి అంటూ భూమన పిలుపునిచ్చారు. 
Back to Top