తొలిరోజు పర్యటనలో వైయస్ జగన్ కు బ్రహ్మరథం

నంద్యాలః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జనసందోహం నడుమ వైయస్ జగన్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డితో కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైయస్ జగన్ రైతునగర్, కానాల, ఎం. చింతకుంట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైయస్ జగన్ కు మహిళలు బొట్టు పెట్టి హారతిచ్చి ఘనస్వాగతం పలుకుతున్నారు.  అడుగడుగునా వైయస్ జగన్ కాన్వాయ్ పై పూలవర్షం కురిపిస్తున్నారు. మహిళలు వైయస్ జగన్ కు రాఖీలు కట్టారు. సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ప్రతి ఒక్కరినీ చిరునవ్వులతో ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు. బాబు మాయమాటలకు మరోసారి మోసపోవద్దని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Back to Top