నందిగామలో సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం

నందిగామ:  వైయస్ ఆర్
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోమరింత
చైతన్యం తెచ్చేలా సోషల్ మీడియా ద్వారా పలు కార్యాక్రమాలను చేపడుతున్నారు. ఇందులో
భాగంగా కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖీ
కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజికవర్గ పరిధిలోని మండలాలు, వార్డులు ,గ్రామాల్లోపార్టీకి విధేయులైన
సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సోషల్
మీడియా ద్వారా పార్టీని మరింత పటిష్టం చేయడానికి తమవంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా
వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఐటి విభాగం కన్వీనర్ జి.దేవేందర్ రెడ్డి,
హర్షవర్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top