సంకల్పరెడ్డిగా నామకరణం

గుంటూరు: ప్రజల సమక్షంలో తమ బిడ్డకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నామకరణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆ చిన్నారి తల్లిదండ్రులు అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కావూరులో కొనసాగుతున్న పాదయాత్రలో జ్యోతి, భాస్కర్‌ దంపతులు వైయస్‌ జగన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి పేరు పెట్టాలని కోరగా జననేత సంకల్పరెడ్డి అని నామకరణం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం నుంచి భాస్కర్‌ జననేత వెంట నడుస్తున్నారు. 
Back to Top