పేరు మార్పు అవాస్తవం

అమరావతి : రాష్ట్రంలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని  ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈనెల 6న, వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో వైయస్‌ జగన్‌ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటారని వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ప్రకటించాయి.

అయితే తాజాగా ప్రజాసంకల్ప యాత్ర కోసం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరు మార్చుకున్నారని, పలు తెలుగు మీడియా ఛానెల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో వార్త ప్రచారం జరిగింది. దీనిపై వెంటనే వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు స్పందించాయి. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరు మార్చుకున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించాయి. నిరాధార వార్తలను నమ్మెద్దని ప్రజలతో పాటు, పార్టీ అభిమానులకు పార్టీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఇటువంటి అసత్య కథనాలను ప్రసారం చేయొద్దని మీడియాను కోరాయి. ఏదైనా ప్రత్యేక అంశం ఉంటే మీడియా సమావేశం లేదా పత్రికా ప్రకటన ద్వారా పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలను తెలియచేస్తామని పార్టీ నేతలు ప్రకటించారు. మరో వైపు పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలపై వారు మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఆటంకాలు సృష్టించినా, ప్రజా సంక్షేమం కోసం వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఈనెల 6నుంచి ప్రారంభమౌతుందని స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top