<br/>నెల్లూరు: తెలుగుదేశం పార్టీ పేరుని వలసల పార్టీ గా మార్చుకొంటే మేలని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కారని ఆయన అన్నారు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అవినీతి డబ్బుతో ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి చర్యల్ని అంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు